ముస్లింలకు నిత్యావసరాల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-24T09:54:49+05:30 IST

రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో

ముస్లింలకు నిత్యావసరాల పంపిణీ

మర్రిగూడ, నాంపల్లి, నల్లగొండ టౌన్‌, మే 23: రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మర్రిగూడలో 16 రకాల నిత్యావసర సరుకులను శనివారం పంపిణీ చేశారు. నాంపల్లి మండలం నేవిళ్లగూడేం, నేరళ్లపల్లి, నాంపల్లి, తిరుమలగిరి, పస్నూర్‌ గ్రామాల్లోని సుమారు 300 ముస్లిం కుటుంబాలకు  15 రకాల నిత్యావసర సరుకులను ఎంపీపీ ఎడుదోడ్ల శ్వేతరవీందర్‌రెడ్డి పంపిణీ చేశారు. నల్లగొండ పట్టణంలోని ముస్లింలకు బియ్యం, నిత్యావసరాలను వడ్డేపల్లి కాశీరామ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కాశీరాం పంపిణీ చేశారు.

Updated Date - 2020-05-24T09:54:49+05:30 IST