డిండి ఎత్తిపోతలకు నిధులు కేటాయించాలి

ABN , First Publish Date - 2020-12-17T06:13:57+05:30 IST

డిండి ఎత్తిపోతలకు నిధులు కేటాయించాలి

డిండి ఎత్తిపోతలకు నిధులు కేటాయించాలి
మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌

మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రవీంద్ర వినతి
దేవరకొండ, డిసెంబరు 16 : డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. సింగరాజుపల్లి రిజర్వాయర్‌ కింద 70ఎకరాల భూసేకరణకు గాను రూ.3.5కోట్లు, గొట్టిముక్కల రిజర్వాయర్‌ కింద 350ఎకరాల భూసేకరణకు రూ.17కోట్లు నిధులు కేటాయిస్తే పనులు పూర్తవుతాయన్నారు. గొట్టిముక్కల రిజర్వాయర్‌లో పుతల్‌రాంతండాకు చెందిన 41 ఇళ్లు, లింగన్నబావిలో 65ఇళ్లు ముంపునకు గురవుతున్నందున ఆర్‌అండ్‌ఆర్‌ ప్యా కేజీ ద్వారా నిర్వాసితులకు రూ.16కోట్లు కేటాయించి పునరావాసం కల్పించాలని కోరారు. గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు 80శాతం పూర్తైనట్లు తెలిపారు. ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయమై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రవీంద్ర తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో డిండి జడ్పీటీసీ మాధవరం దేవేందర్‌రావు, రవీందర్‌నాయక్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-17T06:13:57+05:30 IST