అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-05T05:56:19+05:30 IST

పోలీసు అధికారులు నిర్లక్ష్యం వీడి పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ దళిత గిరిజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.

అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

 కలెక్టరేట్‌ ఎదుట దళిత గిరిజన ఐక్యవేదిక సంఘాల ధర్నా 

భువనగిరి రూరల్‌, డిసెంబరు 4: పోలీసు అధికారులు నిర్లక్ష్యం వీడి పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ దళిత గిరిజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కుడుదుల నగేష్‌ ఐక్యవేదిక జిల్లా నాయకులు బట్టు రాంచంద్రయ్య, బర్రె జహంగీర్‌, వ్యకాస రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి సిర్పంగ స్వామి, పీఎంఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుర్పంగ శివలింగం మాట్లాడారు.  జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ భవనాన్ని వెంటనే పూర్తిచేయాలని, పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్‌ రుణాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రంలో దాదాపు 10లక్షల మంది విద్యార్థులకు నిలిపివేసిన స్కాలర్‌షిప్‌లను యఽథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు దర్గాయి హరిప్రసాద్‌, ఇటుకాల దేవేందర్‌, బండారు రవివర్ధన్‌, బట్టుపల్లి అనురాధ, బట్టు నర్సింగ్‌రావు, బర్రె సుదర్శన్‌, ఈరపాక నర్సింహ, పడిగెల ప్రదీప్‌, బీరం సతీష్‌, డాక్టర్‌ ప్రమీలా, కర్తాల శ్రీనివాస్‌ ఉన్నారు. 

 తాజ్‌పూర్‌ దళితుల నిరసన 

 భువనగిరి మండలం తాజ్‌పూర్‌ గ్రామ దళితులను అవమాన పరిచి ఆలయాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రామస్వామి, కృష్ణ, భాగ్యమ్మ, బాలమణి, పద్మ ఉన్నారు. 

Updated Date - 2020-12-05T05:56:19+05:30 IST