‘ధరణి’ పోర్టల్‌తో భూవివాదాలకు చెక్ : కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-03T10:30:27+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌తో భూవివాదాలకు చెక్ పడుతుందని కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.
సూర్యాపేటరూరల్, నవంబరు 2 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌తో భూవివాదాలకు చెక్ పడుతుందని కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ సోమవారం ప్రారంభం కావడంతో సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ధరణి ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ల వివరాలు తహసీల్దార్ కార్యాలయంలో క్లుప్తంగా ఉండాలని, తప్పనిసరిగా లాగ్‌బుక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యల తీసుకోవాలన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొదటి రోజు ధరణి పోర్టల్ ద్వారా ఒక రిజిస్ట్రేషన్ జరిగిందని తహసీల్దార్ ఎం.వెంకన్న తెలిపారు. ఆయన వెంట డీటీ వంశీ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.