ధనుంజయ్యకు జోతిష్య సామ్రాట్‌ అవార్డు

ABN , First Publish Date - 2020-03-02T11:32:28+05:30 IST

పట్టణానికి చెందిన ప్రముఖ జోతి ష్య నిపుణుడు బ్రహ్మశ్రీ పాశికంటి ధనుంజయ్యను సీవీ.రామన్‌ అకాడమీ జోతిష్య సామ్రాట్‌ అవార్డుతో

ధనుంజయ్యకు జోతిష్య సామ్రాట్‌ అవార్డు

ఆలేరు, మార్చి1 : పట్టణానికి చెందిన ప్రముఖ జోతి ష్య నిపుణుడు బ్రహ్మశ్రీ పాశికంటి ధనుంజయ్యను సీవీ.రామన్‌ అకాడమీ జోతిష్య సామ్రాట్‌ అవార్డుతో పాటు సువర్ణ కంకనం ప్ర దానం చేశారు. హైదరాబాద్‌లోని ప్రి యదర్శిని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సీవీరామన్‌ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌  విజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శ్రీ వెంకటేశ్వర్లు ధనుంజయ్యను జ్యోతిష్య సామ్రాట్‌ అవార్డతో సత్కరించి అభినందించారు.


ఈ సందర్భంగా ధనుంజయ్య మాట్లాడుతూ పదేళ్ల కృషి ఫలితంగా ఈ అవార్డు లభించిందన్నారు. తన సేవలను గుర్తించిన సీవీ.రామన్‌ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కృష్ణ అకాడమీ సంస్థ చైర్మన్‌ చాముండేళ్లర మహర్షి పాల్గొని ధనుంజయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2020-03-02T11:32:28+05:30 IST