అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-12-31T04:32:11+05:30 IST
గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు.

సూర్యాపేట కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి
సూర్యాపేటరూరల్, డిసెంబరు 30: గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. జడ్పీ కార్యాలయంలో బుదవారం జరిగిన సూర్యాపేట, అత్మకూర్(ఎస్) మండలాల్లో జరిగిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల ఆవ శ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఉపాధిహమీ నిధుల ద్వారా మంజూరయ్యే అభివృద్ధి పనులకు నిధులు ప్రభుత్వం వెం టనే కేటాయిస్తుందన్నారు. గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని ఆదేశించారు. అధికారులు పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రకృతి, సెగ్రిగేషన్, వైకుంఠదామాల పనులను పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, పీడీ కిరణ్‌కుమార్, డీపీవో యా దయ్య, ఎంపీపీ రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడీ బిక్షం తదితరులు పాల్గొన్నారు.