ఉపాధి కల్పనలో జాప్యం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-18T04:59:11+05:30 IST

ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించడంలో జాప్యం జరుగుతోందని, సిబ్బంది పనితీరును మార్చుకోవాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

ఉపాధి కల్పనలో జాప్యం: కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

చిలుకూరు, డిసెంబరు 17 : ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించడంలో జాప్యం జరుగుతోందని,  సిబ్బంది పనితీరును మార్చుకోవాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో చిలుకూరు, మఠంపల్లి మండలాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులను ఆయన గురువారం సమీక్షించారు. గ్రామాల్లో జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి 100 రోజులు ఉపాధి కల్పించాలని అన్నారు. గ్రామకార్యదర్శులు కూలీలకు పనికల్పించడం తమ విధిగా భావించాలన్నారు. గ్రామాల్లో ఉపాధి పనులను గుర్తించి గ్రూప్‌ల వారీగా కూలీలకు పనులు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. హరితహారం మొక్కలు చనిపోకుండా చూడాలన్నారు. చనిపోయిన చోట కొత్త మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిలుకూరు, మఠంపల్లి మండలాల వారీగా కార్యదర్శుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, డీపీవో యాదయ్య, ఏపీడీ పెంటయ్య, డీఎల్‌పీవో శ్రీరాములు, చిలుకూరు ఎంపీపీ ప్రశాంతి కోటయ్య, ఎంపీడీవోలు ఈదయ్య, జానకిరాములు, ఎంపీవో యర్రయ్య, కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-18T04:59:11+05:30 IST