‘ప్రీమియర్’ యాజమాన్యం మొండివైఖరి విడనాడాలి
ABN , First Publish Date - 2020-12-03T06:05:02+05:30 IST
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీ యాజమాన్యం మొండివైఖరి విడనాడి, ముందుగా కళ్లుతెరువాలని డీసీసీబీ చైర్మన్, టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా గౌరవాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.

డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
యాదాద్రి రూరల్, డిసెంబరు 2: ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీ యాజమాన్యం మొండివైఖరి విడనాడి, ముందుగా కళ్లుతెరవాలని డీసీసీబీ చైర్మన్, టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా గౌరవాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెద్దకందుకూర్ ప్రీమియర్ ఎక్స్‌ప్లోజీవ్స్ కంపెనీ కార్మికులు వేతన ఒప్పందం, ఇతర సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. దీక్షలకు మద్దతు తెలిపిన బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపా రు. దీక్షల్లో నాయకులు నర్సింహులు, ఎలక్షన్‌రెడ్డి, బాలరాజు, నర్సింహారెడ్డి, వెంకటస్వామి, బీరుమల్లయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనురాధబీరయ్య పాల్గొన్నారు.