ప్రిన్సిపాల్ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-11-27T05:53:17+05:30 IST
పులిచింతల ప్రాజెక్టు దిగువ భాగంలో వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది.

చింతలపాలెం, నవంబరు 26 : పులిచింతల ప్రాజెక్టు దిగువ భాగంలో వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. మృతుడు జగ్గయ్యపేట బ్రైట్ ఏంజిల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ జోస్‌ఫబాబుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా జోస్‌ఫబాబు వారం రోజుల నుంచి కనిపించకపోవడంతో జగ్గయ్యపేట పీఎ్‌సలో మిస్సింగ్ కేసు నమోదైంది.