కొండగడపలో క్రాస్‌ భూముల స్వాధీనం

ABN , First Publish Date - 2020-06-25T11:08:55+05:30 IST

మోత్కూరు మండలం కొండగడప గ్రామంలోని క్రాస్‌ సంస్థ భూముల వివాదం మరోమలుపు తిరిగింది.

కొండగడపలో క్రాస్‌ భూముల స్వాధీనం

అడ్డుకునేందుకు యత్నించిన దళిత రైతుల అరెస్టు


మోత్కూరు, జూన్‌ 24: మోత్కూరు మండలం కొండగడప గ్రామంలోని క్రాస్‌ సంస్థ భూముల వివాదం మరోమలుపు తిరిగింది. క్రాస్‌ సంస్థ డైరెక్టర్‌ కురియన్‌ నుంచి కొనుగో లు చేసిన సర్వే నంబర్‌ 313లోని 10 ఎకరాల 28 గుం టల భూమిని హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా పోలీస్‌ ప్రొటక్షన్‌తో కాంగ్రెస్‌ నేత, మోత్కూరు మార్కెట్‌ మాజీ చైర్మన్‌ వల్లంభట్ల పూర్ణచందర్‌రావు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమి తమకే చెందుతుందని ఆ గ్రామానికి చెందిన దళిత రైతులు రామన్నపేట కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. అక్కడ కొనుగోలుదారుడైన పూర్ణచందర్‌రావుకు అనుకూలంగా తీర్పువచ్చింది. జిల్లా, హైకోర్టులోనూ అప్పీలు చేసినా తనకే అనుకూలంగా తీర్పు వచ్చిందని కొనుగోలుదారు పూర్ణచందర్‌రావు చెప్పారు.


తన కబ్జాలో ఉన్న భూమిపైకి దళిత రైతుల వస్తున్నారంటూ ఆయన హైకోర్టుకు వెళ్లి పోలీస్‌ ప్రొటక్షన్‌తో కూడిన ఇంజక్షన్‌ ఆర్డర్‌ పొందారు. బుధవారం భారీగా పోలీస్‌ ప్రొటక్షన్‌ తీసుకుని వివాదంలో ఉన్న తన భూమిని స్వాధీనం చేసుకున్నాడు. భూమి స్వాధీనాన్ని అడ్డుకోవడానికి యత్నించిన 14మంది రైతులను పోలీసులు అరెస్టు చేసి, ఆత్మకూరు(ఎం) పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. భువనగిరి, చౌటుప్పల్‌ ఏసీపీలు బొట్టు కృష్ణయ్య, సత్తయ్య, రామన్నపేట సీఐ రంగ పర్యవేక్షణలో పలువురు ఎస్‌ఐలు, ఏఎ్‌సఐలు, సిబ్బంది సుమారు వంద మందికి పైగా అక్కడ మోహరించారు.  

Updated Date - 2020-06-25T11:08:55+05:30 IST