రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2020-11-26T06:25:51+05:30 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ మండల పరిధిలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

నల్లగొండ క్రైం, నవంబరు 25 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ మండల పరిధిలో చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పానగల్‌కు  చెందిన జక్కల నాగరాజు (25) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి మునుగోడు కు పనినిమిత్తం వెళ్లి వస్తుండగా కంచనపల్లి శివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందా లేక బైక్‌ అదు పు తప్పి ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు సోదరుడురవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.





బైక్‌ ఢీకొని మహిళ మృతి  

దేవరకొండ, నవంబరు 25 : బైక్‌ ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ సంఘటన దేవరకొండ మండలంలో చోటుచేసుకుంది. సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ నుంచి ఘాజీనగర్‌కు నేనావత్‌ సాలి(45) ఆటో అంచు భాగంలో కూర్చొని వెళ్తుం ది. అదే సమయంలో ఘాజీనగర్‌ నుంచి దేవరకొండ వైపు వస్తున్న బైక్‌ ప్రమాదవశాత్తు సాలిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాలిని దేవరకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


యువతి అదృశ్యం

పెద్దఅడిశర్లపల్లి, నవంబరు 25 : యువతి అదృశ్యమైన సంఘటన మండలంలోని  మేడారం గ్రామంలో బుధవారం జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు వివరాల ప్రకా రం.. మేడారం గ్రామానికి చెందిన సోనగంటి భవాని(20) 8వ తరగతితో చదువు మానే సి ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. మంగళవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా భవాని సైతం దొండకాయలు  కోయడానికి వెళ్లింది. మధ్యాహ్నం అన్నం తిన్నాక తోటి కూలీలకు బయటకు వెళ్ళి వస్తానని చెప్పి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి రాగా భవాని కనిపించకపోవడంతో తోటి కూలీలను వాకబు చేశారు. కూలీలు సైతం తమకు మధ్యాహ్నం నుంచి కనిపించలేదని తెలిపారు. చుట్టుపక్కల, బంధువుల ఇంట్లో  మొ త్తం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 



కారు ఢీకొని వ్యక్తి మృతి

మర్రిగూడ, నవంబరు 25 : కారు బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని రాజుపేటతండా గ్రామ రైస్‌మిల్లు వద్ద బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉప్పు భద్రప్ప(32), అయితగోని శ్రీను ఇద్దరు ద్విచక్రవాహనంపై మండల కేంద్రం నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.  అందులో తీవ్ర గాయాలైన భద్రప్పను వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

Updated Date - 2020-11-26T06:25:51+05:30 IST