రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

ABN , First Publish Date - 2020-12-04T05:13:41+05:30 IST

సీయాసత్‌ ఉర్దూ దినపత్రిక జిల్లా స్టాఫ్‌రిపోర్టర్‌ సయ్యద్‌ మోసిన్‌ అహ్మద్‌(57) గురువారం మేడ్చల్‌ జిల్లా అవుషాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి
మోసిన్‌(ఫైల్‌)

భువనగిరి టౌన్‌, డిసెంబరు 3: సీయాసత్‌ ఉర్దూ దినపత్రిక జిల్లా స్టాఫ్‌రిపోర్టర్‌ సయ్యద్‌ మోసిన్‌ అహ్మద్‌(57) గురువారం మేడ్చల్‌ జిల్లా అవుషాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తున్న అహ్మద్‌ టిప్పర్‌ వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు భువనగిరిలోని మోసిన్‌ స్వగృహంలో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. 

Updated Date - 2020-12-04T05:13:41+05:30 IST