రైల్వే ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2020-07-19T07:51:28+05:30 IST

రైల్వే ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద ..

రైల్వే ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి

భువనగిరి రూరల్‌, జూలై 18: రైల్వే ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి ఎండి ఇమ్రాన్‌ డిమాండ్‌ చేశారు. శనివారం భువనగిరి రైల్వే స్టేషన్‌ ఎదుట రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజా రవాణా ప్రజల కోసమని, పెట్టుబడి దారుల కోసం కాదని కేంద్రం గుర్తించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పల ముత్యాలు, ఎస్‌ వీరస్వామి, రాణా, జి.వెంకటేష్‌, ఎస్‌.శోభన్‌బాబు, రమేష్‌ నర్సింహ, బస్వయ్య, జావిద్‌, యాదగిరి ఉన్నారు.  

Updated Date - 2020-07-19T07:51:28+05:30 IST