రైతుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-12-01T05:34:54+05:30 IST
రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ పట్టణ ప్రధాన కార్యదర్శి జూలూరి వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దేవరకొండ, నవంబరు 30 : రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ పట్టణ ప్రధాన కార్యదర్శి జూలూరి వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పట్టణ శాఖ సమావేశంలో పా ల్గొని మాట్లాడారు. కేంద్రం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దుతో పాటు, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. పట్టణంలో కోతుల బెడదను అరికట్టాలని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిచో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్ర మాలు చేపడుతామన్నారు. సమావేశంలో సీపీఐ అనుబంధ శాఖల కార్యదర్శులు పగిళ్ల బుచ్చయ్య, మైనోద్దీన్, ఆంజనేయులు, తోటపల్లి నరేష్, మల్లయ్య, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.