రాజీమార్గమే రాజమార్గం : న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2020-11-27T05:51:17+05:30 IST

కేసుల విషయంలో రాజీ మార్గమే రాజమార్గమని సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.శ్రీదేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.శ్రీదేవి అన్నారు.

రాజీమార్గమే రాజమార్గం : న్యాయమూర్తులు
సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి శ్రీదేవి

హుజూర్‌నగర్‌ , నవంబరు 26 : కేసుల విషయంలో రాజీ మార్గమే రాజమార్గమని సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.శ్రీదేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.శ్రీదేవి అన్నారు. కోర్టు హాల్‌లో మెగా లోక్‌అదాలత్‌ నిర్వహణపై గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి మెగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 12న కోర్టు హాల్‌లో మెగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసు, రాఘవరావు, సైదులు, చంద్రయ్య, మహేష్‌, గోపాలకృష్ణ, శ్రీనివాసు, అంజయ్య, శ్రీనివాసరెడ్డి, సురే్‌షనాయక్‌ పాల్గొన్నారు. 

Read more