కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి : జూలకంటి

ABN , First Publish Date - 2020-07-15T10:27:18+05:30 IST

కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతూ ఈ నెల 16న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఎదుట నిరసదీక్ష చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్య దర్శివర్గ

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి : జూలకంటి

మిర్యాలగూడ, జులై 14: కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతూ ఈ నెల 16న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఎదుట నిరసదీక్ష చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.


కరోనా వైరస్‌ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫల మయ్యాయన్నారు. వ్యాధి విజృంభిస్తున్నా నివారణ కోసం కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. సమావేశంలో నాయకులు డబ్బికార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్‌ మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన రైల్వే హమాలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2020-07-15T10:27:18+05:30 IST