కరోనా వైరస్‌పై రెడ్ అలర్ట్
ABN , First Publish Date - 2020-03-25T14:39:14+05:30 IST
తి ఒక్కరూ రెడ్ అలర్ట్‌గా ఉంటేనే కరోనా వైర్‌సను పారదోలవచ్చని సూర్యాపేట జిల్లా వైద్యాదికారి నిరంజన్ అన్నారు. సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని కొత్తగూడేనికి చెందిన ఐదుగురు హైదరాబాద్‌లో క్యాబ్

మోతె, మార్చి 24: ప్రతి ఒక్కరూ రెడ్ అలర్ట్‌గా ఉంటేనే కరోనా వైర్‌సను పారదోలవచ్చని సూర్యాపేట జిల్లా వైద్యాదికారి నిరంజన్ అన్నారు. సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని కొత్తగూడేనికి చెందిన ఐదుగురు హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తూ దుబాయ్‌నుంచి వస్తున్న ప్యాసింజర్లను చేరవేశారు. ఈ ఐదుగురూ సోమవారంరాత్రి కొత్తగూడేనికి రావడంతో మండల, జిల్లా వైద్యాధికారులు స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. మండలంలో ఒకరు ఇటలీ నుంచి రావడంతో స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి కుడిచేతిపై గుర్తింపు ముద్రను వేశారు. ఇతను ఇప్పటికే హైదరాబాద్‌లో స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించుకుని వచ్చాడు, కరీంనగర్‌నుంచి మండలానికి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించి వారం రోజులు ఇంట్లో నుంచి రావద్దని హెచ్చరించారు. మహారాష్ట్ర, ముంబాయి, బెంగళూరు నుంచి వచ్చిన నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విదేశాల నుంచి ఎవరైనా గ్రామాలకు వస్తే సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి నిరంజన్ కోరారు. కార్యక్రమంలో డాక్టర్ నాజియా, తహసీల్దార్ పి. యాదిగిరి, ఎంపీడీవో కే.శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్దన్, వైద్య సిబ్బంది కమలమ్మ, సైదులు, నిర్మల, అలివేలు, రాధిక పాల్గొన్నారు.
మోటకొండూరు: బతుకుదెరువుకోసం మహారాష్ట్రకు వెళ్లి తిరిగి స్వగ్రామం యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడేనికి ఒకరు వచ్చారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు మోటకొండూర్ వైద్యాధికారి రాజేందర్ అతడికి వైద్య పరీక్షలుచేశారు. కరోనా లక్షణాలు లేవని వారం రోజులపాటు ఇంట్లోనే ఉండాలని సూచించినట్లు రాజేందర్ తెలిపారు.
ఎయిమ్స్ క్వారంటైన్ సెంటర్‌కు ముగ్గురి తరలింపు
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం డిరేపాక గ్రామానికి చెందిన తల్లీ కూతురు వారం రోజుల క్రితం మహరాష్ట్రకు వెళ్లి వచ్చారు. రెండు రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నందున అనుమానం వచ్చిన గ్రామస్థులు వైద్యాధికారులకు సమాచారం అందించారు. చౌటుప్పల్ మండలం ఆరేగూడేనికి చెందిన యువకుడు దుబాయ్ నుంచి గ్రామానికి వచ్చాడు. వైద్య సిబ్బంది ఈ ముగ్గురిని బీబీనగర్ ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. మండలంలోని చిన్నరావులపల్లి గ్రామంలోని హిందుస్థాన్ శానిటరివేర్ కంపెనీలో పని చేయడానికి బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన ఎనిమిది మంది యువకులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
చౌటుప్పల్ టౌన్: బెంగళూరులో ఉద్యోగం చేసే చౌటుప్పల్ మునిసిపాలిటీలోని తంగడపల్లికి చెందిన నలుగురు యువకులకు క్వారంటైన్ ముద్ర ఉంటే వారిని తిరిగి హైదరాబాద్‌కు పంపామని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మండలంలో ఈ నెల ఒకటో తేదీనుంచి 24 వరకు 105 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచామని ఆయన తెలిపారు.
రామన్నపేట: ఇతర రాష్ర్టాలనుంచి రామన్నపేటకు వచ్చిన ఐదుగురిని పోలీసులు, వైద్య సిబ్బంది గుర్తించి వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.
వలిగొండ: మండలానికి ఏడుగురు విదేశాల నుంచి, 57 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. వీరిలో లింగరాజుపల్లి, వలిగొండకు చెందిన 21 మంది చేతులపై మండల వైద్యాధికారి సుమన్‌కల్యాణ్, ప్రత్యేక ముద్రలు వేశారు. మిగిలిన వారికి బుధవారం ముద్రలు వేస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. ముద్రలు ఉన్న వారు ఇంటినుంచి 14 రోజులు బయటికి రాకూడదని వైద్యులు తెలిపారు.