ఉమ్మడి జిల్లాలో 86 పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-19T07:55:24+05:30 IST

ఉమ్మడి జిల్లాలో శనివారం ఒక్క రోజే 86 పాజిటివ్‌ కేసులు ..

ఉమ్మడి జిల్లాలో 86 పాజిటివ్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూలై 18: ఉమ్మడి జిల్లాలో శనివారం ఒక్క రోజే 86 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 54, సూర్యాపేటలో 21, యాదాద్రి జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో శ్వాస, సరైన సమయంలో వైద్యం అందక ఒకరు మృతిచెందారు.


నల్లగొండ పట్టణం పూజిత అపార్టుమెంటులో మూడు, చైతన్యపురి కాలనీ, రామగిరి, శివాజీనగర్‌లో రెండు చొప్పున ఆరు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అదేవిధంగా బోయవాడ, జిల్లా ఆస్పత్రి రోడ్‌, ఎన్జీ కళాశాల, రాక్‌హిల్స్‌ కాలనీ, రవీంద్రనగర్‌ కాలనీలో ఒకటి చొప్పున ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మిర్యాలగూడ 16, దేవరకొండ, మాడ్గులపల్లి, శాలిగౌరారం, నాగార్జునసాగర్‌లో రెండు చొప్పున ఆరు, నార్కట్‌పల్లి, నిడమనూరు, చింతపల్లి మండలంలో ఒకటి చొప్పున మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐదు, కోదాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మోతె మండలం వల్లభాపురం, ఉర్లుగొండ, బాలెంల, ఆకుపాముల, గాజులమల్కాపురం, చిలుకూరు మండలం రామాపురం, పాలకీడు, త్రిపురవరం, గుమ్మడవల్లి, ఆరెగూడెంలో ఒకటి చొప్పున 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


యాదాద్రి జిల్లా గుట్టలో మూడు, ఆలేరు మండలం శారాజీపేటలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భువనగిరి, బీబీనగర్‌, మోత్కూరు, చౌటుప్పల్‌ మండలం తంగేడుపల్లి, రాజాపేట, రామన్నపేట మండలం మునిపంపులలో ఒకటి చొప్పున ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


నాగార్జునసాగర్‌ ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులకు పాజిటివ్‌ వచ్చింది. ఒకరు అనస్థీషియా మహిళా డాక్టర్‌ కాగా, మరొకరు వైద్యుడైన ఆమె భర్త. శనివారం ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు ఆమె మత్తు ఇంజక్షన్‌ ఇచ్చారు. అంతేగాక ఆస్పత్రిలో శనివారం రాపిడ్‌ పరీక్షలను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రారంభించగా, ఈ దంపతులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామంలో తాజాగా, రెండు పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, వారి కాంటాక్టులు 23 మందిని హోంకార్వంటైన్‌ చేశారు.


చౌటుప్పల్‌ పట్టణంలోని గణే్‌షనగర్‌కు చెందిన తండ్రి, కుమారుడికి పాజిటివ్‌ వచ్చింది. వారిని హోంక్వారంటైన్‌ చేశారు.


నిడమనూరు సమీపంలోని రామాపురం గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. హోంక్వారంటైన్‌ చేశారు.


చింతపల్లి మండలంలోని వీటీనగర్‌కు చెందిన ఓ వృద్ధురాలికి పాజిటివ్‌గా వచ్చింది. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు ఐదుగురిని హోంక్వారంటైన్‌ చేశారు.


పెద్దఅడిశర్లపల్లి మండలంలోని బాలాజీనగర్‌కు చెందిన తొమ్మిది, 11 ఏళ్ల పిల్లలకు పాజిటివ్‌ వచ్చింది. గత ఆదివారం వీరి ఇంటికి హైదరాబాద్‌ నుంచి బంధువులు వచ్చి వెళ్లారు. కాగా, తల్లిదండ్రులకు మాత్రం నెగటివ్‌ వచ్చింది.


నకిరేకల్‌ మండలం మర్రూర్‌ గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చింది.


శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో 65ఏళ్ల వృద్ధురాలికి పాజిటివ్‌ వచ్చింది.


దేవరకొండ పట్టణంలో 11 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రాపిడ్‌ పరీక్షల కేంద్రాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, వస్త్ర, కిరాణా దుకాణాలు ఈనెల 20 నుంచి 26వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్టు ఆయా అసోసియేషన్ల నాయకులు ప్రకటించారు.


మోత్కూరు మునిసిపాలిటీలో 55 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతడితోపాటు కుటుంబ సభ్యులు ఐదుగురిని హోంక్వారంటైన్‌ చేశారు.


నిడమనూరు మండల కేంద్రంలో శనివారం నుంచి ఈనెలాఖరు వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు చేయాలని వ్యాపారులు నిర్ణయించారు.


చండూరులో తాజాగా పాజిటివ్‌ కేసు నమోదవడంతో మునిసిపాలిటీలో పలుచోట్ల హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.


మిర్యాలగూడ పట్టణంలో వర్తక, వ్యాపారులు ఈ నెల 20 నుంచి 31 వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో శనివారం దుకాణాలు కిటకిటలాడాయి.


నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు 133 రాపిడ్‌ టెస్టులు  చేయగా తొలి రోజు ఒకటి, రెండో రోజు శనివారం 8, మొత్తం 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


ఆలేరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 15 మందికి రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా, గుండ్లగూడెం గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-07-19T07:55:24+05:30 IST