నెమ్మదించని కరోనా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 81 పాజిటివ్
ABN , First Publish Date - 2020-08-11T17:39:04+05:30 IST
ఉమ్మడి జిల్లాలో సోమవారం 81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండలో 58, సూర్యాపేటలో 20, యాదాద్రిలో 3 పాజిటి వ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 2530 పాజిటివ్

నల్లగొండ(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో సోమవారం 81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండలో 58, సూర్యాపేటలో 20, యాదాద్రిలో 3 పాజిటి వ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 2530 పాజిటివ్ కేసు లు నమోదుకాగా, 21మంది మృతిచెందారు. 203 మంది కరోనాతో కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 2306 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భూదాన్‌పోచంపల్లిలో భార్యాభర్తకు పాజిటివ్ వచ్చింది. డిండి మండలపరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. మోత్కూరులో గతంలో పాజిటివ్ వచ్చిన ఇద్దరిని 108లో గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి పంపించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రాపిడ్ పరీక్షల్లో చౌటుప్పల్‌లో 13, నకిరేకల్ 11, నాగార్జునసాగర్‌లో తొమ్మిది, ఉమ్మడి దామరచర్ల మండలంలో ఏడు, చింతపల్లి మండలం వీటీనగర్, అనంతగిరిలో ఆరు చొప్పున, చండూరులో ఐదు, తిరుమలగిరి, ఆలేరు, గుర్రంపోడులో నాలుగు చొప్పున, ఉమ్మడి మేళ్లచెర్వు మండలం, నడిగూడెంలో మూడు చొప్పున, పెద్దఅడిశర్లపల్లి, మోటకొండూరు, దేవరకొండ, రామన్నపేటలో రెండు చొప్పున, తుంగతుర్తి, మోత్కూరు, వలిగొండ, సంస్థాన్ నారాయణపురంలో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాదగిరిగుట్టలో మంగళవారం నుంచి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు సాగుతాయని, ఆ తరువాత లాక్‌డౌన్ విధిస్తున్నట్టు మునిసిపల్ కమిషనర్ జంపాల రజిత తెలిపారు. దేవరకొండ డివిజన్‌కు 250 హోంఐసోలేషన్ కిట్లు మంజూరైనట్టు డిప్యూటి డీఎంహెచ్‌వో కృష్ణకుమారి తెలిపారు. ఈ కిట్‌లో మాస్కులు, శానిటైజర్, హ్యండ్ గ్లౌజులు, కరోనా మందులు ఉంటాయని చెప్పారు. ఇవి అన్ని పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.