ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 39 మందికి కరోనా.. ఏఏ ప్రాంతాల్లో నమోదయ్యాయంటే..
ABN , First Publish Date - 2020-07-27T18:10:54+05:30 IST
ఉమ్మడి జిల్లాలో ఆదివారం 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 6, సూర్యాపేట జిల్లాలో 22, యా దాద్రి జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

నల్లగొండ, ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్ : ఉమ్మడి జిల్లాలో ఆదివారం 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 6, సూర్యాపేట జిల్లాలో 22, యా దాద్రి జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, నల్లగొండ ఆస్పత్రిలో ఓ మహిళ మృతి చెందింది.
తిప్పర్తి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
చిట్యాల, వెలిమినేడు పీహెచ్‌సీల్లో రాపిడ్ పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. కాగా, మండలంలోని ఓ ఫార్మాల్యాబ్ కంపెనీలో 12మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది.
పీఏపల్లి మండలంలోని ఘనపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్ వచ్చింది.
భూదాన్ పోచంపల్లి మునిసిపల్ కేంద్రంలో నివాసం ఉంటున్న ఒకరికి పాజిటివ్ వచ్చింది. అతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, భార్యకు నెగటివ్ వచ్చింది.
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన 50ఏళ్ల మహిళకు పాజిటివ్ నిర్ధారణ కాగా. ఆమె కుమారుడికి గతంలో పాజిటివ్ రాగా, హోంక్వారంటైన్‌లో ఉన్నాడు.
చింతపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యాపారి దంపతులకు ఇటీవల పాజిటివ్ రాగా, వారి వద్ద పనిచేసే వ్యక్తికి కూడా పాజిటివ్ వచ్చింది.
గుండాల మండలంలోని అనంతారం గ్రామంలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడికి పాజిటివ్ వచ్చింది.
నల్లగొండ మండలంలోని రాములబండ పీహెచ్‌సీలో 9మందికి రాపిడ్ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ వచ్చింది.
నూతన్‌కల్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పోలీస్ సిబ్బందికి పాజిటివ్ వచ్చింది.
శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ, ఆమె కుమారుడికి పాజిటివ్ వచ్చింది. వీరు నకిరేకల్‌లో రాపిడ్ పరీక్ష చేయించుకున్నారు. నాలుగు రోజుల క్రితం మహిళ భర్తకు సైతం పాజిటివ్ వచ్చింది. కాగా, శాలిగౌరారం పీహెచ్‌సీలో రాపిడ్ కిట్లు లేకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి.
కేతేపల్లి పీహెచ్‌సీలో 15మందికి రాపిడ్ పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగటివ్ వచ్చింది.
నార్కట్‌పల్లి మండలంలోని అవురవాణి గ్రామానికి హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా 14 రోజులు క్వారంటైన్ ఉండాల్సిందేనని, అందుకు గ్రామ శివారులోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయంలో వసతి ఏర్పాట్లు చేసినట్టు సర్పంచ్ మాదగోని అండాలు ప్రకటించారు.
భువనగిరిలో సోమవారం నుంచి సాయంత్రం 5గంటలకే అన్ని దుకాణాలు మూసివేసేలా వర్తక, వ్యాపార సంఘాలు నిర్ణయించాయి.
ఉమ్మడి జిల్లాలో కరోనా చికిత్సా కేంద్రాలు
జిల్లా చికిత్సా కేంద్రాలు ఐసీయూ బెడ్లు
నల్లగొండ నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి 10
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి -
నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రి -
దేవరకొండ ఏరియా ఆస్పత్రి -
నకిరేకల్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ -
సూర్యాపేట సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి 20
నోట్ : యాదాద్రి జిల్లాలో కొవిడ్ చికిత్సా కేంద్రాలు లేవు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు లేవు.
కరోనా అప్డేట్స్ సూర్యాపేట నల్లగొండ యాదాద్రి
పాజిటివ్ కేసులు 419 683 189
యాక్టివ్ కేసులు 321 593 153