నల్లగొండలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు.. మరో 81 మందికి పాజిటివ్‌..

ABN , First Publish Date - 2020-07-22T16:41:56+05:30 IST

ఉమ్మ డి జిల్లాలో మంగళవారం 81 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 45, సూర్యాపేటలో 27, యాదాద్రి జిల్లాలో 9 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

నల్లగొండలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు.. మరో 81 మందికి పాజిటివ్‌..

నల్లగొండ(ఆంధ్రజ్యోతి): ఉమ్మ డి జిల్లాలో మంగళవారం 81 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 45, సూర్యాపేటలో 27, యాదాద్రి జిల్లాలో 9 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.


మిర్యాలగూడలో 33 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీలో ఓ హోటల్‌ నిర్వాహకుడికి పాజిటివ్‌ వచ్చింది. ఆరుగురిని హోంక్వారంటైన్‌ చేశారు.


హుజూర్‌నగర్‌ పట్టణం యాదవ బజార్‌కు చెందిన ఒకరితోపాటు, చంద్రం హోటల్‌ బజారులో ఒకరికి, స్థానిక కోర్టులో పనిచేసే ఓ మహిళా ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కోర్టుకు రెండురోజులు సెలవు ప్రకటించారు.


మేళ్లచెర్వు మండలంలో మూడు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. 


మోత్కూరులో 52ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి, పాటిమట్ల గ్రామానికి చెందిన దంపతుల కుపాజిటివ్‌ వచ్చింది.


నడిగూడెం మండలంలోని ఈకేపేట, కరవిరాలలో తాజాగా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి 82 మందిని హోంకార్వంటైన్‌ చేశారు.


తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. 


ఆలేరు మండలంలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేవిధంగా స్థానిక పీహెచ్‌సీలో 10 మందికి రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.


ఆత్మకూరు(ఎం) మండలంలోని ఖఫ్రాయిపల్లికి చెందిన ఒకరికి, పారుపల్లి గ్రామానికి చెందిన మరొకరికి పాజిటివ్‌ వచ్చింది.16మందిని హోంక్వారంటైన్‌ చేశారు.


చింతపల్లి మండలంలో ఇద్దరు పోలీస్‌ సిబ్బంది, మరో మహిళకు పాజిటివ్‌ వచ్చింది.


దేవరకొండ ఆస్పత్రిలో 21 మందికి రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.


హాలియా మునిసిపాలిటీకి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


నిడమనూరు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి గుండె, ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కాగా, అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా, పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


సాగర్‌ ఆస్పత్రిలో 62మందికి రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది.


యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని పాతగుండ్లపల్లికి చెందిన ఒకరికి, మండలంలోని మర్రిగూడెంలో మరొకరికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా వంగపల్లికి చెందిన ఓ వృద్ధుడు పాజిటివ్‌తో మృతిచెందాడు.


చౌటుప్పల్‌లో తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు, వీరి కుటుంబాలకు చెందిన మరోముగ్గురు, స్థానికంగా మరో ముగ్గురికి పాజిటి వ్‌ వచ్చింది.


భువనగిరి ఆస్పత్రిలో 28 మందికి రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా, నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.


కొండమల్లేపల్లిలో కొవిడ్‌ నిబంధనలు పాటించని ఓ చికెన్‌సెంటర్‌ నిర్వాహకుడికి గ్రామపంచాయతీ కార్యదర్శి వీరబాబు రూ.వెయ్యి జరిమానా విధించారు.


కరోనా అప్డేట్స్‌ సూర్యాపేట నల్లగొండ యాదాద్రి

పాజిటివ్‌ కేసులు 325 540 182

యాక్టివ్‌ కేసులు 227 450 119

Updated Date - 2020-07-22T16:41:56+05:30 IST