ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా కల్లోలం.. ఆదివారం ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-07-20T16:34:37+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఆదివారం 100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 69, సూర్యాపేట 16, భువనగిరిలో జిల్లాలో 15 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా కల్లోలం.. ఆదివారం ఒక్కరోజే..

పాజిటివ్‌ సెంచరీ

నల్లగొండ, ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌: ఉమ్మడి జిల్లాలో ఆదివారం 100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 69, సూర్యాపేట 16, భువనగిరిలో జిల్లాలో 15 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాయి.


నల్లగొండ జిల్లాలో 69 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో నల్లగొండ పట్టణానికి చెందినవి 33 ఉన్నాయి. మిర్యాలగూడలో 17, దేవరకొండలో 11, నకిరేకల్‌, త్రిపురారంలో ఒకటి చొప్పున రెండు, కట్టంగూర్‌, నిడమనూరు, గుడిపెల్లిలో రెండు చొప్పున ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


అడ్డగూడూరు మండలంలోని డి.రేపాకలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. అతడిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌ చేశారు.


అర్వపల్లి మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన మహిళ 15 రోజులుగా కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.


భూదాన్‌పోచంపల్లి మండలంలోని పెద్దరావులపల్లికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. ఇతడు బీబీనగర్‌లో అద్దెకు ఉంటూ హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో పనిచేస్తున్నాడు.


చిట్యాల మండలంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.


మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో మరొకరికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటికే అతడి కుమారుడైన ఆర్‌ఎంపీ, కోడలు పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు.


త్రిపురారం మండలంలోని డొంకతండ పరిధి హర్జాతండాలో 32 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతడు హైదరాబాద్‌లో ట్యాక్సీ నడుపుతూ, కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చి తిరిగివెళ్లాడు.


తిరుమలగిరి మునిసిపాలిటీలో మరో పాజిటివ్‌ కేసు నమోదైంది.


అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతడి కాంటాక్టులు 44 మందిని హోంక్వారంటైన్‌ చేశారు.


భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో భార్యభర్తకు పాజిటివ్‌ వచ్చింది.


దేవరకొండ మునిసిపాలిటీలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కాగా, దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 26 మందికి కరోనా రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగటివ్‌ వచ్చింది.


చింతపల్లి మండల కేంద్రానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.


కట్టంగూరు మండలంలోని ఎర్రసానిగూడెంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీరు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.


మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో 17 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో పట్టణానికి చెందినవి ఎనిమిది ఉన్నాయి. కాగా, రెడ్డికాలనీలోని ఓ అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్న రైస్‌మిల్లర్‌ కరోనా అనుమానిత లక్షణాలతో ఆదివారం మృతి చెందాడు.


మోతె మండల కేంద్రం, విభలాపురం, ఉర్లుగొండ గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

Updated Date - 2020-07-20T16:34:37+05:30 IST