భువనగిరి మునిసిపాలిటీలో కరోనా కాల్‌సెంటర్‌

ABN , First Publish Date - 2020-03-18T11:40:07+05:30 IST

ప్రజల్లో నెలకొన్న కరోనా భయాందోళనను తొలగించేందుకు భువనగిరి మునిసిపాలిటీలో ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు

భువనగిరి మునిసిపాలిటీలో  కరోనా కాల్‌సెంటర్‌

కాల్‌సెంటర్‌ నెంబర్‌ 9398718044 


భువనగిరి టౌన్‌, మార్చి17: ప్రజల్లో నెలకొన్న కరోనా భయాందోళనను తొలగించేందుకు భువనగిరి మునిసిపాలిటీలో ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఇన్‌చార్జి కమిషనర్‌ టి.నాగిరెడ్డి తెలిపారు. కాల్‌సెంటర్‌ నోడల్‌ అధికారిగా మునిసిపల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ శనిగల రజిత విధులు నిర్వహిస్తారని తెలిపారు. కరోనా వ్యాధిపై సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం కాల్‌సెంటర్‌ సెల్‌:9398718044ను సంప్రదించాలన్నారు. కరోనా నివారణ కోసం మునిసిపల్‌ యంత్రాంగం పారిశుధ్య సేవలను విస్తృతం చేసిందన్నారు. 

Updated Date - 2020-03-18T11:40:07+05:30 IST