మహిళల భద్రతకు కృషి
ABN , First Publish Date - 2020-03-13T11:54:24+05:30 IST
విద్యార్థినులు, యువతులు, మహిళల భద్ర తే ప్రధాన ల క్ష్యంగా పోలీస్ శాఖ కృషి చే స్తుందని ఎస్పీ ఏవీ.రంగనాథ్ అన్నారు.

నల్లగొండ , మార్చి 12: విద్యార్థినులు, యువతులు, మహిళల భద్ర తే ప్రధాన ల క్ష్యంగా పోలీస్ శాఖ కృషి చే స్తుందని ఎస్పీ ఏవీ.రంగనాథ్ అన్నారు. అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఎంజీయూలో ఆర్ట్స్ సెమినార్ హాల్ లో మహిళల భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం, పోలీ్‌సశాఖ మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని అన్నా రు.
మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎలాంటి ఫిర్యాదు, సమాచారం వచ్చినా వివరాలను గోప్యంగా ఉంచి వేధింపులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నా రు. ఎంజీయూలో ఉమెన్ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంజీయూ రిజిస్ర్టార్ యాదగిరికి సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ నర్మద మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల రక్ష ణ, భద్రత కోసం అధిక ప్రాధాన్యమిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ డయల్ 100 నెం బర్‌ను సేవ్ చేసుకోవాలని, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు షీ టీమ్స్ సేవలందిస్తున్నాయని అన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మహిళల భద్రత, పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై పా టల రూపంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్ ప్రొఫెసర్ యాదగిరి, ఎన్‌ఐఆర్‌డీ ప్రతినిధి మాధవి, అన్నపూర్ణ, షీ టీమ్ సీఐ రాజశేఖర్‌గౌడ్, నార్కట్‌పల్లి సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ విజయ్‌కుమార్, ఏఎ్‌సఐ సోమిరెడ్డి, సిబ్బంది, అధ్యాపకులు విజయలక్ష్మి, నర్సింహ, విజయకుమారి, పాషా, సురే్‌షరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.