రెండు ప్రాంతాల రైతుల లబ్ధికి కృషి
ABN , First Publish Date - 2020-05-18T09:57:20+05:30 IST
సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెండు ప్రాంత రైతుల లబ్ధికి తాము కృషి చేస్తున్నట్లు భువనగిరి, నకిరేకల్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య తెలిపారు. ధర్మారెడ్డిపల్లి..

వలిగొండ/ రామన్నపేట మే 17: సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెండు ప్రాంత రైతుల లబ్ధికి తాము కృషి చేస్తున్నట్లు భువనగిరి, నకిరేకల్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య తెలిపారు. ధర్మారెడ్డిపల్లి కాల్వ నీటి పంపకంలో గొల్నేపల్లి, రామన్నపేట మండల రైతుల సమస్యలు తెలుసుకునే ందుకు ఆదివారం వీరు కాల్వను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు గ్రామాల రైతుల ఇబ్బందులు తొలగించేందుకు త్వరలో నీటి పారుదల శాఖ అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపా రు. గోకారం గ్రామం చెరువు వద్ద ధర్మారెడ్డిపల్లి కాల్వ తూంను వెడల్పు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాల్వలోని గుర్రపుడెక్క తొ లగించేందుకు సహకరిస్తామని ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు. రా మన్నపేట మండలంలోని ధర్మారెడ్డిపల్లి కాల్వను కూడా ఎమ్మెల్యేలు పరిశీలించారు.