థర్మల్‌ పవర్‌ కొనుగోలుకు ఒప్పందం

ABN , First Publish Date - 2020-03-13T11:51:36+05:30 IST

యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నుంచి ప్ర భుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరిందని కమర్షియల్‌ ఇంధన శాఖ

థర్మల్‌ పవర్‌ కొనుగోలుకు ఒప్పందం

మిర్యాలగూడ, మార్చి 12: యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నుంచి ప్ర భుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరిందని కమర్షియల్‌ ఇంధన శాఖ డైరెక్టర్‌ టీఆర్‌కే రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర పవర్‌ జ నరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిర్మించిన 4000 మెగావాట్ల యాదాద్రి థర్మ ల్‌ పవర్‌ కేంద్రం ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు  దీర్ఘకాలిక ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. టీఎస్‌ఎ్‌సపీడీఎల్‌, టీఎ్‌సఎన్‌పీడీఎల్‌ టీఎస్‌ జెన్‌కోతో కలిపి టీఎస్‌ డిస్కమ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ ప్రభాకర్‌రావు, చీఫ్‌ ఇంజనీర్ల, డైరైక్టర్ల సమక్షంలో బుధవారం ఒప్పందం కుద్చుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-03-13T11:51:36+05:30 IST