నకిరేకల్‌ మునిసిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి

ABN , First Publish Date - 2020-11-19T05:42:38+05:30 IST

నకిరేకల్‌ మునిసిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అన్నారు.

నకిరేకల్‌ మునిసిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌

డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌

నకిరేకల్‌, నవంబరు 18 : నకిరేకల్‌ మునిసిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అన్నారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నకిరేకల్‌లో కాంగ్రెస్‌ బలంగా ఉందని త్వరలో జరిగే మునిసిపాలిటీ ఎన్నికల్లో 20వార్డులకు 20పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటాలన్నారు. పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎ్‌సలో చేరడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, మునిసిపాలిటీ ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పేందు కు ప్రతి కార్యకర్త పట్టుదలతో పని చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ మా య మాటలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి కాంగ్రె్‌సను బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ గెలుపుకోసం పనిచేసే కా ర్యకర్తలను పార్టీ ఎప్పుడైనా గుర్తిస్తుందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని నకిరేకల్‌కు తెచ్చి కార్యకర్తల్లో ధైర్యం నిప్పేందుకు కృషి చేస్తామన్నారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య మాట్లాడుతూ కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మునిసిపాలిటీని కాంగ్రెస్‌ కైవసం చేసుకొని పార్టీ సత్తా చాటేందుకు కార్యకర్తలు ముందుండాలన్నారు. కాం గ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు లింగాల వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సర్పంచ్‌ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి యేసుపాదం, మాజీ సర్పంచ్‌ రాచకొండ భిక్షమమ్మ, ఎండీ.అంజద్‌షరీఫ్‌, యాస కర్ణాకర్‌రెడ్డి, కొండ జానయ్యగౌడ్‌, ఎండీ.మహబూబ్‌అలీ, నూనె కోటి, రాచకొండ శ్రవ ణ్‌, దుబ్బాక యాదగిరిరెడ్డి, జానయ్యగౌడ్‌, రాజు, యాదగిరి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-19T05:42:38+05:30 IST