టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు
ABN , First Publish Date - 2020-06-23T09:47:25+05:30 IST
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కృష్ణతండా టీఆర్ ఎస్‌లో వర్గ విభేదాలతో సోమవారం పరస్పరం దాడులు చేసుకున్నారు

పరస్పరం దాడులు
పలువురికి గాయాలు
మఠంపల్లి, జూన్ 22: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కృష్ణతండా టీఆర్ ఎస్‌లో వర్గ విభేదాలతో సోమవారం పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణతండాలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ రెబల్ అభ్యర్థిగా బానోతు శంకర్ పోటీ చేసి ఓటమి చెందాడు. ఈనెల 19న శంకర్ కుటుం బంలో వేడుక జరిగింది.
ఈ వేడుకలో మహిళ శంకర్‌ను గ్రామసర్పంచ్‌గా పోలుస్తూ గిరిజన భాషలో పాట పాడింది. ఆ పాటను విన్న ప్రస్తుత సర్పంచ్ ఆ మహిళతో ఆదివారం అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు శంకర్‌ను దూషించాడు. దీంతో సోమ వారం గ్రామంలో ఘర్షణ మొదలైంది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకు న్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శంకర్ వర్గీయులను స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తున్న శంకర్ వర్గీయులపై సర్పంచ్ వర్గీయులు పోలీస్‌స్టేషన్ ఎదుటే దాడిచేసినట్లు సమాచారం. ఈ ఘటనలపై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.