హరితహారం మొక్కలు సంరక్షించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-08-18T11:08:58+05:30 IST

హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కలెక్టర్‌ పీజే.పాటిల్‌ కోరారు.

హరితహారం మొక్కలు సంరక్షించాలి : కలెక్టర్‌

తిప్పర్తి / మాడ్గులపల్లి / మిర్యాలగూడ రూరల్‌ / త్రిపురారం / నిడమనూరు, ఆగస్టు 17 : హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కలెక్టర్‌ పీజే.పాటిల్‌ కోరారు. సోమవారం ఆయన దుప్పలపల్లి నుంచి తిప్పర్తి వరకు ప్రధాన రహదారి పక్కన నాటిన మొక్కలను పరిశీలించారు. జంగారెడ్డిగూడెం గ్రామ పంచాయతీలోని మల్లెపల్లివారిగూడెం వద్ద ఆగారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నాటిన ప్రతి మొక్కను సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకొని సంరక్షించాలని సూచించారు. తిప్పర్తి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనం పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మాడ్గులపల్లి మండలంలోని మాచనపల్లి, కన్నెకల్‌ గ్రామాలను సందర్శించి పల్లెప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలతోపాటు 6వ విడత హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు, ధీరావత్‌తండాలో పల్లె ప్రకృతి వనాలు, శ్రీనివా్‌సనగర్‌ గ్రామపంచాయతీలో వైకుంఠదామాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ శేఖర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. తుంగపాడులోని ప్రకృతివనంలో రూపొందించిన కళాకృతులను పరిశీలించి అభినందించారు.


రాతిబండ కళాకృతుల దృశ్యాలను స్టేట్‌ కమిటీకి పంపించినట్లు తెలిపారు. త్రిపురారం మండలంలోని కంపసాగర్‌ కృషి విజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించి పరిశోధనా ల్యాబ్‌లు, ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం మొక్క ను నాటారు. నిడమనూరు మండలంలోని గుంటిపల్లి, వేంపాడు, ఇండ్లకోటయ్యగూ డెం గ్రామాల్లో కలెక్టర్‌ డీఆర్‌డీవో శేఖర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఆయన వెంట ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ కృష్ణయ్య, ఎస్‌ఐ సత్యనారాయణ,  ఎంపీడీవో జితేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్‌ కృష్ణయ్య, ఎంపీడీవో అజ్మీరాదేవిక, తహసీల్దార్‌ గణేష్‌, ఎంపీపీ అనుముల పాండమ్మ, ఎంపీడీవో అలివేలు మంగమ్మ ఉన్నారు.

Updated Date - 2020-08-18T11:08:58+05:30 IST