25 నుంచి జిల్లాలో హరితహారం

ABN , First Publish Date - 2020-06-18T11:24:54+05:30 IST

జిల్లాలో ఈనెల 25వ తేదీ నుంచి తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌

25 నుంచి జిల్లాలో హరితహారం

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌


నల్లగొండ అర్బన్‌, జూన్‌ 17: జిల్లాలో ఈనెల 25వ తేదీ నుంచి తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌నుంచి ఎంపీడీఓలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈనెల 20లోపు అన్ని గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటేందుకు గుంతలు సిద్ధం చేసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలునాటాలని, 1.20లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గుంతలు, ట్రీ గార్డులు సిద్ధం చేసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, డీఆర్‌డీఏ పీడీ శేకర్‌రెడ్డి, పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌, జడ్పీ డిప్యూటీ సీఈఓ సీతాకుమారి తదితరులు పాల్గొన్నారు. 


ఉపాధి హామీతో సాగునీటి పారుదల పనులు చేపట్టాలి 

ఉపాధి హామీ పథకం అనుసంధానంతో సాగునీటి పారుదల పనులు, కెనాల్స్‌ పనులను చేపట్టాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. ఉపాధి హామీ పథకం, సాగు నీటి పారుదల అనుసంధానంపై కలెక్టరేట్‌లో బుధవారం ఇంజనీరింగ్‌ అధికారులకు ఒక రోజు ఓరియంటేషన్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఉపాధి హమీ పథకం కింద సాగునీటి కాల్వలు, చెరువుల పూడికతీత, పొదల తొలగింపు పనులు చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సాగర్‌ ఎడ మ కాలువ, ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ, ఐబీ ఇంజనీరింగ్‌ శాఖల పరిధిలో మాన్యువల్‌ చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించి పనులు చేపట్టాలని సూచించారు.


అన్ని పంచాయితీల్లో ఈనెల 19 నుంచి పనులు ప్రారంభించాలన్నారు. గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదల శాఖ, ఇంజనీరింగ్‌ అధికారులు సమన్వయంతో పని చేసి ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు సాగు నీరు అందించేలా కాలువల పూడికతీత చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ ఎస్‌ఈ సాయిబాబా, ఎన్‌ఎ్‌సపీ లెఫ్ట్‌ కెనాల్‌ ఎస్‌ఈ విజయ బాస్కర్‌, డ్యాం ఎస్‌ఈ మధుసూదన్‌, ఐబీ ఎస్‌ఈ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-18T11:24:54+05:30 IST