ఉపాధి పనులపై టాంటాం వేయించాలి
ABN , First Publish Date - 2020-12-10T05:54:00+05:30 IST
ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి డీఈవో కార్యాల యం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.

కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్లగొండ, డిసెంబరు 9: ప్రతి గ్రామంలో ఉపాధి పనికి కూలీలు హాజరయ్యే విధంగా టాంటాం వేయించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం ఆయన జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా పల్లె ప్రకృతి వనం, లేబర్ రిపోర్టు, నర్సరీల పురోగతిపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ రాబోయే గణతంత్ర దినోత్సం రోజు పల్లె ప్రగతి అవార్డులు అందిస్తామన్నారు. అవార్డులకు జనవరి 1 తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటామన్నారు. బ్యాగ్ ఫిల్లింగ్, సిడ్ సోయింగ్ మొత్తం పనులు తదుపరి వీసీ వరకు నూరుశాతం పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, జడ్పీ సీఈవో వీర బ్రహ్మచారి తదితర అధికారులు పాల్గొన్నారు.
యూట్యూబ్ ఛానల్‌ను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ క్రైం: ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి డీఈవో కార్యాల యం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన యూట్యూబ్ చానల్‌ను ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు సబ్‌స్ర్కైబ్ చేసుకుని విద్యార్థులు కూడా సబ్‌స్ర్కైబ్ చేసుకునే విధంగా చూడాలన్నారు. విద్యార్థులందరూ ఆన్‌లైన్ పాఠాలు వినే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఈఓ బొల్లారం భిక్షపతి మాట్లాడుతూ జిల్లాలోని సబ్జెక్టు నిపుణులతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు రూపొందించి ఆ వివరాలను డీ ఈఓ నల్లగొండ యూట్యూబ్ ఛానల్‌లో తరగతుల వారీగా అందుబాటులో ఉంచుతామన్నారు. సందే హాలున్నా విద్యార్థులు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకో వాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ కొమ్ము శ్రీనివాస్, హెచ్‌ఎంల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనయ్య, టెక్నికల్ పర్సన్లు రమేష్‌రెడ్డి, కొరివి కృష్ణ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.