పంట నూర్పిడి కల్లాలు పూర్తి చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-19T05:47:53+05:30 IST

మంజూరు చేసిన రైతు నూర్పిడి కల్లాల గ్రౌ ండింగ్‌ వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు.

పంట నూర్పిడి కల్లాలు పూర్తి చేయాలి : కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

నల్లగొండ క్రైం, నవంబరు 18: మంజూరు చేసిన రైతు నూర్పిడి కల్లాల గ్రౌ ండింగ్‌ వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏఈపీ ఆర్లు, వ్యవసాయశాఖ ఏడీలు, విస్తరణాధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రైతు పొలాల్లో పంట నూర్పిడి కల్లాలు మంజూరి చేసిన వాటిలో 50శాతం గ్రౌండింగ్‌ చేసి వాటిలో 25శాతం వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అదే విధంగా అన్ని వైకుంఠ ధామాలలు కూడా నె ల రోజుల్లో పూర్తిచేయాలన్నారు. ఆవాస ప్రాంతాల్లో భూమి గుర్తించిన చోట ప్రకృతి వనాలు వచ్చే వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏఈఓలు రైతు కల్లాల నిర్మానానికి అత్యంత ప్రాధాన్యతగా భావించి టార్గెట్‌ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీవో విష్ణువర్థన్‌, జడ్పీ సీఈఓ వీరబ్ర హ్మచారి, అగ్రికల్చర్‌ జేడీ శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-11-19T05:47:53+05:30 IST