ఉన్నతంగా ఎదగాలనే కలలు కనాలి

ABN , First Publish Date - 2020-12-06T05:26:08+05:30 IST

ఉన్నతంగా ఎదగాలనే గొప్ప కలలు కనడమే స్వేరోయిజమని తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

ఉన్నతంగా ఎదగాలనే కలలు కనాలి
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

పెద్దవూర, డిసెంబరు 5: ఉన్నతంగా ఎదగాలనే గొప్ప కలలు కనడమే స్వేరోయిజమని తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వేరోస్‌ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌, కుట్టుమిషన్‌ శిక్షణ కేంద్రాలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదరికంలో ఉండి భవిష్యత్‌ కోసం ఎదురు చూసే వారికి స్వేరోస్‌ దారి చూపుతోందన్నారు. గురుకులాల్లో 12లక్షల మంది విద్యార్థులు ఇప్పటికే కంప్యూటర్‌ విద్య నేర్చుకున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు, పురుషులు రాణిస్తున్నారని, మహిళలు కుట్టు మిషన్‌ రంగాన్ని చిన్నతనంగా చూడకుండా ఉత్పత్తిదారులుగా ఎదిగేందుకు ప్రయత్నించి సంద సృషించాలన్నారు. నల్లగొండ జిల్లాలో మారుమూల గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయన్నారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న బాలికలను, అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రజాప్రతినిధులు, వారి తల్లిదండ్రులు ప్రోత్సహించా లన్నారు. పెద్దవూరలో మినిగురుకులాన్ని నిర్మించాలని పలు సంఘాల నేతలు కోరారు. కార్యక్రమంలో పెద్దవూర, తిరుమలగిరి ఎంపీపీలు చెన్ను అనురాధ, ఆంగోత్‌ భగవాన్‌నాయక్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సూర్యం, ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఆర్‌సీవో అరుణకుమారి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-06T05:26:08+05:30 IST