రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-27T06:07:18+05:30 IST

భారత రాజ్యాంగ స్పూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్‌
రాజ్యాంగ ఉపోద్ఘాతం చదివి వినిపిస్తున్న కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

భువనగిరి రూరల్‌, నవంబరు 26: భారత రాజ్యాంగ స్పూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బందితో ఆమె రాజ్యాంగ ఉపోద్ఘాతం చదివించారు. భారత రాజ్యాంగ ప్రాధాన్యం, ఆలోచనలు, వ్యాప్తి చేయాలనే సంకల్పంతో నవంబరు 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జాతీయతా దినోత్సవంగా, సంవిధాన్‌ దివాస్‌గా ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, ఖీమ్యానాయక్‌ పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

బీబీనగర్‌: భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉన్న దని ఏయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు.  నేషనల్‌ కాన్స్టిట్యూషన్‌ డే సంద ర్భంగా బీబీనగర్‌ ఏయిమ్స్‌ ప్రాంగణంలో డైరెక్టర్‌ భాటియా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.  


చౌటుప్పల్‌ టౌన్‌: చౌటుప్పల్‌ మునిసిపల్‌ కార్యాలయంలో మునిసిపల్‌ కమిషనర్‌ మందడి రామదుర్గారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలంగౌడ్‌ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


 ఆత్మకూరు(ఎం):  తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ పి.జ్యోతి మాట్లాడారు. 

 అడ్డగూడూరు : భారత రాజ్యాంగ నిర్మాత డి.బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విద్యార్థి జనసమితి కో కన్వీనర్‌ బాలెంల బాబుమహజన్‌ అన్నారు.  అఖిలపక్షం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహనికి క్షీరాభిషేకం నిర్వహించారు.  


ఆత్మకూరు(ఎం): తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ పి.జ్యోతి మాట్లాడారు.  ఆత్మకూరు(ఎం):  తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ పి.జ్యోతి మాట్లాడారు. 

Updated Date - 2020-11-27T06:07:18+05:30 IST