ఎవరికో..ఆప్షన్‌.. మునిసిపాలిటీల్లో కో ఆప్షన్ పదవుల సందడి..!

ABN , First Publish Date - 2020-07-28T19:16:18+05:30 IST

మునిసిపాలిటీల్లో కోఆప్షన్‌ పదవుల సందడి నెలకొంది. ప్రతి మునిసిపాలిటీలో నాలుగు పదవులను భర్తీ చేయనున్నారు. సోమవారం ఆశాహులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.

ఎవరికో..ఆప్షన్‌.. మునిసిపాలిటీల్లో కో ఆప్షన్ పదవుల సందడి..!

సూర్యాపేట టౌన్‌/ భువనగిరి టౌన్‌(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల్లో కోఆప్షన్‌ పదవుల సందడి నెలకొంది. ప్రతి మునిసిపాలిటీలో నాలుగు పదవులను భర్తీ చేయనున్నారు. సోమవారం ఆశాహులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆగస్టు 5న చేతులెత్తే విధానంలో నలుగురు కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. సూర్యాపేట మునిసిపాలిటీలో 25మంది నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి మునిసిపల్‌ కో-ఆప్షన్‌ బరిలో తుది జాబితా ప్రకారం 11మంది పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నలుగురు అభ్యర్థులను, బీజేపీ ఒక అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్‌ మాత్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది. దేవరకొండ మునిసిపాలిటీలో 37మంది నామినేషన్‌ వేశారు. ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు కమిషనర్‌ పూర్ణచందర్‌రావు తెలిపారు. 


గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ మునిసిపాలిటీలో కో ఆప్షన్‌ స్థానాలకు పోటీ పెరిగింది. 20వార్డులకుగాను చైర్మన్‌తో పాటు 12మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌లే ఉన్నారు. ఆలేరు మునిసిపాలిటీలోని ముస్లిం మైనార్టీ కోఆప్షన్‌ పదవికి ఒక నామినేషన్‌ దాఖలైనట్లు మునిసిపల్‌ కమిషనర్‌ హన్మంతప్రసాద్‌ తెలిపారు. మాజీ వార్డు మెంబర్‌ ఎండి.సలీం నామినేషన్‌ దాఖలుచేశారు. చండూరు మునిసిపాలిటీలో నాలుగు కోఆప్షన్‌ పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 22మంది నామినేషన్లు వేశారు. ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. జనరల్‌ అభ్యర్థులు రావిరాల నగేష్‌, మహిళా అభ్యర్థి సంకోజు దుర్గమ్మ, మైనార్టీ కోటాలో ఎండి ముజ్జు, సయ్యద్‌ ఖైరూ బేగంవహీద్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కమిషనర్‌ బాలకృష్ణ తెలిపారు. వారికి నియామకపత్రాలు అందజేశారు. 

Updated Date - 2020-07-28T19:16:18+05:30 IST