నేడు పేటకు సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2020-06-22T11:18:42+05:30 IST
అమరుడైన కల్నల్ సం తో్‌షబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం సూర్యాపేట

కల్నల్ సంతో్‌షబాబు కుటుంబసభ్యులకు పరామర్శ
ప్రభుత్వ సాయాన్ని స్వయంగా అందించనున్న ముఖ్యమంత్రి
అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
సూర్యాపేట, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అమరుడైన కల్నల్ సం తో్‌షబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రానికి రానున్నారు. ఆయన రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయం లో సూర్యాపేటకు రోడ్డుమార్గాన 2.30గంటలకు చేరుకోనున్నారు. నేరు గా కల్నల్ సంతో్‌షబాబు నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శిస్తారు. అనంతరం ప్రభుత్వం తరపున రూ.5కోట్ల నగదు, హైదరాబాద్‌లో ని షేక్‌పేటలోని 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగానికి సంబంధించిన నియామకపత్రాలను అందజేయనున్నారు. సీఎంతోపాటు మంత్రి జగదీ్‌షరెడ్డి, మరికొంత మందినే అనుమతించనున్నారు. కాగా, కేసీఆర్ రాక సందర్భంగా అధికారులు జిల్లా కేంద్రం లో రోడ్లపై గుంతలను పూడ్చివేశారు. సీఎం వచ్చే రోడ్డు మార్గంలో గతంలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలను మునిసిపల్ అధికారులు తొలగించారు. అదేవిధంగా బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. సంతో్‌షబాబు నివాసం ఉండే వీధిలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటా రు. ఎక్కడా చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతికదూరం పాటించేలా అధికారు లు చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సంతో్‌షబాబు నివాసం వద్దకు అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతించనున్నారు. సీఎం వచ్చి వెళ్లే వరకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్,పోలీస్ శాఖ అధికారులు సమన్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. విద్యుత్ నిరంతరం ఉండేలా ఆ శాఖ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఏర్పాట్లను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షించారు.
సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు..సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
వీర జవాన్ కల్నల్ సంతో్‌షబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం రానుండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. కల్నల్ సంతో్‌షబాబు ఇంటి వద్ద ఏర్పాట్లను ఎస్పీ భాస్కరన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని, మా స్కులు తప్పక ధరించాలని సూచించారు. ఆయన వెంట ఇన్‌చార్జి డీఆర్‌వో మోహన్‌రావు, డీఎస్పీ మోహన్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి ఉన్నారు. కాగా, సీఎం రాక సందర్భంగా, మునిసిపల్ కార్యాలయంలో ఇన్‌చార్జి డీఆర్‌వో ఎస్.మోహన్‌రావు, సీఎం చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ (అదనపు ఎస్పీ) శ్రీనివాసరావు స్థానిక అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. సంతో్‌షబాబు ఇంటివద్ద వాటర్ ఫ్రూఫ్ టెంట్లు, బ్యారీకేడ్లు, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాట్లు చేయాలని వారు సూచించారు. పట్టణ ప్రజలు గుంపులుగా ఉండకుండా ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.