హామీల అమలులో సీఎం కేసీఆర్ విఫలం
ABN , First Publish Date - 2020-12-29T06:18:23+05:30 IST
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు అన్నారు.
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు
భువనగిరి రూరల్/ బీబీనగర్/ భూదాన్‌పోచంపల్లి/ మోటకొండూరు/ రామన్నపేట/ రాజాపేట, డిసెంబరు 28: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు అన్నారు. సోమవారం భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీమోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, మోటకొండూరు, రామన్నపే, వలిగొండ, రాజాపేట మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్లకు వనతిపత్రాలు అందజేశారు.