సరిహద్దు చెక్‌పోస్టుల మూసివేత

ABN , First Publish Date - 2020-03-24T11:53:19+05:30 IST

తెలంగాణ, ఏపీ సరిహద్దు అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెంలోని

సరిహద్దు చెక్‌పోస్టుల మూసివేత

కోదాడ రూరల్‌ / దామరచర్ల / సాగర్‌, మార్చి23 : తెలంగాణ, ఏపీ సరిహద్దు అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెంలోని రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను సోమవారం పూర్తిగా నిలిపివేశారు. దీంతో కొంతమంది వాహనాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ రాష్ర్టానికి వెలుతుంటే ఎందు కు వెళ్లనివ్వరని డీఎస్పీ, సీఐలతో వాగ్వాదానికి దిగారు. ఆంధ్రా పోలీసుల సూచనల మేరకే వాహనాలు నిలిపామని డీఎస్పీ రఘు తెలిపారు.


రెండు రాష్ర్టాల్లో 31వరకు లాక్‌డాన్‌ ప్రకటించగా ఎందుకు ప్రయానిస్తున్నారని ప్రశ్నించారు. అత్యావసరానికి సంబంధించిన వాహనాలు మినహా మిగతా వాటిని అనుమంతించలేదని పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు వాహనాలను నిలిపివేశారు. లారీలను సమీపంలోని యార్డుకు తరలిస్తున్నారు. డ్రైవర్లకు చెక్‌పోస్ట్‌ వద్ద అధికారులు భోజన సదుపాయాలు కల్పించారు. ఏపీ-తెలంగాణ సరిహద్దు అయిన సాగర్‌ చెక్‌పోస్టు నుంచి రాకపోకలు నిలిపివేశారు. సుమారు 2గంటల పాటు వాహనాలు నిలపడంతో నడిరోడ్డుపై సుమారు కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి.  

Read more