బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి : సీఐ
ABN , First Publish Date - 2020-11-27T06:08:24+05:30 IST
బాలకార్మిక, బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని సీఐ ఆదిరెడ్డి కోరారు. రూంటూ రీడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలిక విద్యపై కళాజాత ప్రదర్శన నిర్వహించారు.

దేవరకొండ, నవంబరు 26 : బాలకార్మిక, బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని సీఐ ఆదిరెడ్డి కోరారు. రూంటూ రీడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలిక విద్యపై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. ముందుగా కళాజాత ప్రదర్శనను ఉద్దేశించి సీఐ మాట్లాడారు. బాలికలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. కళాజాత ప్రదర్శనతో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది రవికుమార్, కళాజాత ప్రతినిధులు వెంకటచారి పాల్గొన్నారు.