చోరీకి యత్నించి..గ్రామస్థులకు చిక్కి
ABN , First Publish Date - 2020-12-01T05:44:07+05:30 IST
చోరీకి యత్నించిన వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని పల్లెర్ల గ్రామంలో చోటుచేసుకుంది.

ఆత్మకూరు(ఎం), నవంబర్ 30: చోరీకి యత్నించిన వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని పల్లెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం పల్లెర్ల గ్రామా నికి చెందిన కృష్ణారెడ్డి సుద్దాల గ్రామానికి వెళ్లాడు. అతని భార్య లక్ష్మి ఇంటి తలుపు లు పెట్టి పక్కింట్లో మాట్లాతోంది. అదే ఊరిలో జరుగుతున్న ఓ వివాహానికి వచ్చిన మోత్కూరుకు చెందిన పల్లపు ఉపేందర్ అనే యువకుడు తలుపులు తీసి ఇంట్లోకి వెళ్తుండగా, నోముల వెంకట్‌రెడ్డి అనె వ్యక్తి గమనించాడు. వెంటనే పక్కింట్లో ఉన్న లక్ష్మీకి సమాచారం ఇచ్చాడు. ఆమె వచ్చి మాఇంట్లో దొంగ ఉన్నాడంటూ కేకలు వేసింది. ఆమె అరుపులు విని ఇంట్లో ఉన్న వ్యక్తి తలుపునకు గడియ పెట్టున్నాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న గ్రామస్థులు ఇంటి తలుపులు తీసి లోపల ఉన్న ఉపేందర్‌ను బయటకు తీసుకొచ్చి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. కాగా ఉపేందర్ కు మతిస్థిమితం సరిగ్గా లేక దొంగ తనాలకు పాల్పతున్నట్లు అతని తల్లి అంజమ్మ తెలినట్లు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రారెడ్డి తెలిపారు.