రైతులకు అండగా నిలబడాలి: ఎమ్మెల్యే చిరుమర్తి
ABN , First Publish Date - 2020-10-27T11:37:24+05:30 IST
రైతులకు మార్కెట్ కమిటీ సభ్యులు అం డగా నిలబడాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు

కేతేపల్లి, అక్టోబరు 26: రైతులకు మార్కెట్ కమిటీ సభ్యులు అం డగా నిలబడాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సోమవారం క్యాంపు కార్యాలయంలో నార్కట్ పల్లి మార్కెట్ కమిటీ సభ్యులుగా నియమితులైన కేతేపల్లి మండల నాయకులు కలిసి తమ నియామకానికి కృషి చేసినందుకు కృత జ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సింగిల్‌విండో డైరెక్టర్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండేటి సైతిరెడ్డి, డైరెక్టర్లు దాసరి సునీత, టి.వెంకన్నగౌడ్, నాయకులు ఇబ్రహీం, ఆనయ్య, ఎ.సత్యనారాయణ ఉన్నారు.
ఎమ్మెల్యేని కలిసిన ప్రజాప్రతినిధులు, నాయకులు
చిట్యాల రూరల్: దసరా పండుగ సందర్భంగా చిట్యాల మండల ప్రజాప్రతినిదులు, టీఆర్ఎస్ నాయకులు నకిరేకల్ ఎమ్మెలే చిరుమర్తి లింగయ్యను సోమవారం నకిరేకల్‌లో కలిశారు. జమ్మిని ఎమ్మెల్యేకు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సుంకెనప ల్లి సర్పంచ్ కక్కిరేణి బొందయ్య, కొలను వెంకటేష్‌గౌడ్, పేరేపల్లి, సుంకెనపల్లి ఆనగంటి కిరణ్, బాతరాజు రవీందర్, పేరేపల్లి, కొలను సతీష్‌గౌడ్, ఆవుల అయిలయ్య, అంతటి శివకుమార్‌గౌడ్ పాల్గొన్నారు.