నీటి పంపులో పడి చిన్నారి మృతి
ABN , First Publish Date - 2020-10-31T07:35:39+05:30 IST
నీటి పంపులో పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం రా మాంజపురం గ్రామంలో గురువారం జరిగింది

శాలిగౌరారం, అక్టోబరు 30: నీటి పంపులో పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం రా మాంజపురం గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికిచెందిన పిండి శ్రీశైలం-స్వప్న దంపతులకు ఏడాదిన్నర వయసు ఉన్న కుమార్తె మనుశ్రీ ఉంది. దసరా పండుగ సందర్భంగా స్వప్న పుట్టిల్లు రామాంజపురం గ్రామానికి కుటుంబంతో వచ్చింది. ఇంటి ఆవరణలో చిన్నారులతో ఆడుకుంటున్న క్రమంలో మనుశ్రీ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి అక్కడికక్కడే మృతి చెందింది. మనుశ్రీ మృతదేహాన్ని దత్తప్పగూడెంకు తీసుకుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.