చచ్చిన కోళ్లు, కుళ్లిన మాంసం అమ్మకం
ABN , First Publish Date - 2020-12-04T04:57:33+05:30 IST
లొట్టలేసుకుని తినే కోడి మాంసంలో కల్తీ జరుగుతోంది.

తనిఖీలో అధికారుల గుర్తింపు
కోదాడలో చికెన్ దుకాణం సీజ్
కోదాడటౌన్, డిసెంబరు 3: లొట్టలేసుకుని తినే కోడి మాంసంలో కల్తీ జరుగుతోంది. చచ్చిన కోళ్లు, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఓ చికెన్ దుకాణాన్ని కోదాడ మునిసిపల్ అధికారులు గుర్తించి దానిని సీజ్ చేశారు. కోదాడ మునిసిపల్ కమిషనర్ మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కోదాడ పట్టణం ఖమ్మం క్రాస్‌రోడ్డులోని క్వాలిటీ చికెన్సెంటరును మునిసిపల్ సిబ్బంది గురువారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో చచ్చిన కోళ్లను, కుళ్లిన మాంసాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. శుభకార్యాలకు 50 కేజీల చికెన్ ఆర్డరు ఇస్తే చనిపోయిన కోళ్ల మాంసం 15 కేజీలు కలుపుతున్నారని తెలిపారు. చికెన్ దుకాణాన్ని సీజ్ చేశామని తెలిపారు. మాంసం విక్రయాల్లో ప్రమాణాలు పాటించకుంటే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.