పుంజుకున్న చికెన్ ధరలు
ABN , First Publish Date - 2020-03-25T13:40:50+05:30 IST
రోనా వైర్‌సతో చిక్కిపోయిన చికెన్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. లాక్‌డౌన్‌లో చికెన్ అమ్మకాలకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో కోళ్ల వ్యాపారులు ఊపిరిపీల్చుకున్నారు. మొన్నటి వరకు చికెన్

- లాక్‌డౌన్‌లో చికెన్ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి
- రూ.30 నుంచి రూ.120కి పెరిగిన కిలో చికెన్ ధర
- గతంలో కరోనా వైరస్ పుకారుతో పడిపోయిన మార్కెట్
- పుంజుకుంటున్న చికెన్ మార్కెట్
చౌటుప్పల్ టౌన్, మార్చి24: కరోనా వైర్‌సతో చిక్కిపోయిన చికెన్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. లాక్‌డౌన్‌లో చికెన్ అమ్మకాలకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో కోళ్ల వ్యాపారులు ఊపిరిపీల్చుకున్నారు. మొన్నటి వరకు చికెన్ తినేందుకు జంకిన జనం ప్రభుత్వమే లాక్‌డౌన్‌లో అమ్మకాలకు అవకాశం కల్పించడంతో ప్రజలు చికెన్‌పై మొగ్గు చూపుతున్నారు. పదిరోజుల క్రితం వరకు స్కిన్‌లె్‌స చికెన్ ధర కిలోకు రూ.30 నుంచి రూ.35 వరకు పడిపోయిన విషయం విదితమే. మంగళ వారం కిలో చికెన్ ధర రూ.104 నుంచి రూ.110కు చేరింది. మరికొన్ని దుకాణాల్లో కిలో రూ.120 వరకు విక్రయించారు. పాతాళంలోకి పడిపోయిన చికెన్ ధరలు ఇప్పుడిప్పుడే మెరుగుప డుతుండడంతో పెంపకం దారుల్లో కొంత భరోసా ఏర్పడింది. రెండు రోజుల క్రితం ఫారం గేటు వద్ద లైవ్ బాయిలర్ కోడికిలో ధర రూ.33 ఉండగా, అది రూ.50లకు చేరుకుంటుంది. ఈ ధరలు రెండు, మూడు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫారం గేట్ ధర కిలోకు రూ.65 నుంచి రూ.70కి చేరవచ్చని దుకాణదారులు అంచనా వేస్తున్నారు. ఫారాల వద్ద లైవ్ బ్రాయిలర్ కోళ్లు కిలోకు రూ.46 వంతున ట్రేడర్స్ లిప్టింగ్ చేసి దుకాణదారులకు కిలోకు అదనంగా పది రూపాయలు పెంచి డంప్ చేస్తున్నారు. దీంతో దుకాణదారులు రిటైల్‌గా స్కిన్‌లె్‌స కిలో ధర రూ.104 నుంచి రూ.120లకు విక్రయిస్తున్నారు.
చికెన్ ధరలు పెరిగే అవకాశం
కొద్ది రోజుల్లో బ్రాయిలర్ చికెన్ ధర మరింత పెరిగే చేరే అవకాశాలు ఉ న్నట్టు కోళ్ల పెంపకందారులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఎదుగుదల కోళ్లను సైతం అర్థాంతంగా విక్రయించడం, కరోనా సమస్యతో ఇప్పట్లో కోళ్ల పెంపకాన్ని చేపట్టడానికి ఆసక్తిని చూపించక పో వడం, అందులోను రానున్న వేసవిలో కోళ్ల పెంపకానికి చాలామంది విరామం ప్రకటించడం వంటి పరిణామాలతో చికెన్ కొరత తీవ్రంగా ఏర్పడనుంది. అందులోనూ చికెన్‌కు కరోనా వైరస్ లేదని, చికెన్ తినడంతో ఎలాంటి నష్టంలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తుండడంతో వినియోగదారుల్లో కరోనా భయం తగ్గుతుంది. ఇలాంటి పరిణామాలతో చికెన్ ధరలు గణనీయంగా పెరిగిపోయే అవకాశాలుంటాయని ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు.
చికెన్ అమ్మకాలకు అవకాశం కల్పించడం శుభపరిణామం
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్ ప్ర కటించిన ప్రభుత్వం చికెన్ అమ్మకాలకు అవకాశం కల్పించడం శుభపరిణామం. కరోనా సమస్యతో తీవ్రంగా నష్టపోయిన కోళ్ల పెంపకందారులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొంత ఉపశమనం కలిగింది. చికెన్ తినడంతో ఆరోగ్యానికి ఎలాంటి హానీ జరగదు. కేవలం పుకార్లతోనే చికెన్ విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. వాస్తవాలను తెలుసుకున్న వినియోగదారులు చికెన్ కొనుగోళ్ల వైపు ఇప్పుడిప్పుడే మొగ్గు చూపుతుండడం సంతోషకరం.
- ముత్యాల పాపిరెడ్డి, ఉమ్మడి జిల్లా సీనియర్ ట్రేడర్, చౌటుప్పల్