రైతులపై నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-15T05:43:24+05:30 IST

రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తోందని వామపక్ష నాయకులు ఆరోపించారు.

రైతులపై నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 14 : రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తోందని వామపక్ష నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా కొత్తచట్టాలను రూపొందిస్తుందని విమర్శించారు. అనంతరం ఏవో శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి దొడ్డ వెంకటయ్య, ఏఐకేఎంఎస్‌ నాయకులు మండారి డేవిడ్‌కుమార్‌, కొత్తపల్లి శివకుమార్‌, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, నర్సయ్య, రేణుక, సైదమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-15T05:43:24+05:30 IST