యాదాద్రిలో శతఘటాభిషేక పూజలు

ABN , First Publish Date - 2020-09-21T07:01:02+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం స్వామి జన్మనక్షత్రం స్వా తి వేడుకలు శాస్త్రోక్తంగా కొనసాగాయి

యాదాద్రిలో శతఘటాభిషేక పూజలు

ప్రధానాలయంలో లైటింగ్‌ ఏర్పాట్లు


యాదాద్రి టౌన్‌, సెప్టెంబరు 20: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం స్వామి జన్మనక్షత్రం స్వా తి వేడుకలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. అష్టోత్తర శతఘటాభిషేక పూజలు, సాయంత్రం వేళ స్వామి అమ్మవార్ల రథవాహన సేవోత్సవాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. బాలాలయంలో కవచమూర్తులను కొలిచిన అర్చకులు ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై అధిష్ఠించారు. కల్యాణ మండపంలో అష్టోత్తర శతకలశాలకు హోమ పూజలు, శతఘటాభిషేక  పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సువర్ణ పుష్పాలతో అర్చించి అర్చకులు క్షేత్ర మహత్యాన్ని భక్తులకు వివరించారు. సాయంత్రం వేళ బాలాలయంలో లక్ష్మీనృసింహులను దివ్యమనోహరంగా అలంకరించి రథవాహన సేవ నిర్వహించారు. కాగా, స్వామి వారికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.4,54,440 ఆదా యం సమకూరింది.

     

భక్తుల కోలాహలం 

యాదాద్రీశుడి సన్నిధిలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం వారాంతం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ తిరువీధులు, ప్రసాదాల విక్రయశాల, తదితర ప్రాంతాలు సందడిగా మారాయి. హరిహరులను దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ దర్శన క్యూలైన్ల వద్ద శానిటైజర్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలా మైక్‌ ద్వారా అవ గాహన కల్పించారు.

   

ప్రధానాలయంలో లైటింగ్‌

యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా ప్రధానాలయంలో పలు శిల్పాలను శిల్పులు అమర్చుతున్నారు. ప్రధానాలయంలో ప్రవేశమార్గంలో శంఖు, చక్రనామాలను అమర్చారు. సుదర్శన చక్రానికి లైటింగ్‌ అమర్చారు. ప్రధానాలయంలో అత్యాధునిక లైటింగ్‌ ఏర్పాటు చేసి ఆళ్వార్‌ పిల్లర్లను దేదీప్యమానంగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2020-09-21T07:01:02+05:30 IST