సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట: డీఎస్పీ
ABN , First Publish Date - 2020-12-17T06:01:38+05:30 IST
చిట్యాల రూరల్, డిసెంబరు 16:చిట్యాల రూరల్, డిసెంబరు 16:కెమెరాలను ఏర్పాటు చేసినట్లయితే నేరాలకు సులువుగా అడ్డుకట్ట వేయవచ్చని నల్లగొండ డీఎస్పీ జి.వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

చిట్యాల రూరల్, డిసెంబరు 16: చిట్యాల రూరల్, డిసెంబరు 16:చిట్యాల రూరల్, డిసెంబరు 16:కెమెరాలను ఏర్పాటు చేసినట్లయితే నేరాలకు సులువుగా అడ్డుకట్ట వేయవచ్చని నల్లగొండ డీఎస్పీ జి.వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి సహకారంతో రూ. 4లక్షలతో 18 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా బుధవారం డీఎస్పీ ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, నేరాలు జరిగినట్లయితే నిందితులను సులువుగా పట్టుకోవడమే కాకుండా ఆధారాలను గుర్తించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలన్నారు. మండల పరిధిలో మొట్టమొదటిసారిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని స్థానిక సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుంకరి ధనమ్మయాదగిరి, సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ పెద్దబోయిన సత్తయ్యయాదవ్, ఉపసర్పంచ్ ఉయ్యాల లింగయ్య, సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ రావుల నాగరాజు పాల్గొన్నారు.