కారుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-05T05:30:00+05:30 IST

నకిరేకల్‌ మండల పంచాయతీ అధికారి నాగలక్ష్మి కుటుంబానికి పెనుప్రమాదం తప్పింది.

కారుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
ముళ్లపొదలు అడ్డుతగిలి బావి దగ్గర ఆగిన కారు

నకిరేకల్‌, డిసెంబరు 5: నకిరేకల్‌ మండల పంచాయతీ అధికారి నాగలక్ష్మి కుటుంబానికి పెనుప్రమాదం తప్పింది.  హైదరాబాద్‌లో జరిగే బంధువుల శుభకార్యానికి నకిరేకల్‌ నుంచి శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కారులో బయ లు దేరారు. నకిరేకల్‌ శివారులో 65వ జాతీయ రహదారిపై వెనుక నుంచి వెళ్తున్న మరో కారు నాగలక్ష్మి కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారు రోడ్డు పక్కనే ఉన్న బావి వైపు వెళ్లింది. బావి అంచుల్లో కంపచెట్లు దట్టంగా ఉండడంతో అవి తగిలి కారు ఆగింది. సమీపంలో ఉన్న వారు గమనించి కారులో ఉన్న వారిని వెంటనే బయటికి తీశారు. కంపచెట్లు అడ్డు తగలకుంటే పెద్ద ప్రమాదం జరిగేది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST