మత్స్యగిరీశుడి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి
ABN , First Publish Date - 2020-11-25T05:50:31+05:30 IST
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి 30 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.

వలిగొండ, నవంబరు 24: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి 30 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. 25న యాగశాల వాస్తుశాంతి, మృ త్స్యంగ్రహణం, విశ్వక్సేనారాధన, గరుఢ ధ్వజాధివాసం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, 26న గరుఢ ధ్వజప్రతిష్ట, పల్లకి, ధ్వజారోహణ బలిప్రదానం, బేరీ తాండవం, దేవతాహ్వానం, హోమం, 27న చతుస్థానార్చన, హోమం, బలిప్రదానం, శాత్తుమొర, ఎదుర్కోలు. 28న ఉదయం 11గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు. 29న యాగశాల ద్వారతోరణార్చన, అలంకారం, రాజభోగం 30న పూర్ణాహుతి, చక్రతీర్థం, దేవతోద్వాసనం, పుష్పయాగ ద్వాదశారాధన, ధ్వజావరోహణం వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి.