ఉత్సాహంగా రాక్‌ క్లైంబింగ్‌

ABN , First Publish Date - 2020-12-13T05:30:00+05:30 IST

భువనగిరి ఖిల్లాపై రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ ఆదివారం ఉత్సాహంగా కొనసాగింది.

ఉత్సాహంగా రాక్‌ క్లైంబింగ్‌
రాక్‌ క్లైంబింగ్‌ చేస్తున్న ఔత్సాహికుడు

భువనగిరి టౌన్‌, డిసెంబరు 13: భువనగిరి ఖిల్లాపై రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ ఆదివారం ఉత్సాహంగా కొనసాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు శిక్షణలో పాల్గొన్నారు. సాహస క్రీడల్లో రాక్‌ క్లైంబింగ్‌ పేరుగాంచిందని, ఈ క్రీడకు భువనగిరి ఖిల్లా అనువుగా ఉన్నదని వారు పేర్కొన్నారు. రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ చీఫ్‌ కోచ్‌ పరమేశ్వర్‌సింగ్‌ ఆధ్వర్యంలో శిక్ష ణ కొనసాగింది. రెండు రోజులు సెలవులు రావడంతో ఖిల్లాపై పర్యాటకుల సందడి నెలకొంది. వందలాది మంది పర్యాటకులు సందర్శించారు. 


Updated Date - 2020-12-13T05:30:00+05:30 IST